Saturday, August 30Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

TS TRT recruitment 2023:  సెప్టెంబర్ 20 నుంచి 5089 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ.. త్వరపడండి..

TS TRT recruitment 2023:  సెప్టెంబర్ 20 నుంచి 5089 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ.. త్వరపడండి..

Telangana
 TS TRT recruitment 2023:  డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ తెలంగాణ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2023 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 21. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. schooledu.telangana.gov.in. టీచర్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్‌లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను భర్తీ చేయడానికి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించనుంది.TS TRT రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు: 5089 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.TS TRT రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము రూ.1000. ఎక్కువ పోస్ట్‌లకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్కో పోస్ట్‌కు రూ.1000 చెల్లించాలి .TS TRT రిక్రూట...
TS EDCET 2023 Counselling : BEd అడ్మిషన్ షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవిగో..

TS EDCET 2023 Counselling : BEd అడ్మిషన్ షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవిగో..

Telangana
మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) కౌన్సెలింగ్ 2023 షెడ్యూల్‌ను సెప్టెంబర్ 18న సోమవారం విడుదల చేసింది. BEd కోర్సుల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్. 30. ఆసక్తి గల అభ్యర్థులు edcet.tsche.ac.inలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, 2023–2024 విద్యా సంవత్సరానికి రెండు సంవత్సరాల BEd కోర్సులో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం అన్‌రిజర్వ్డ్ (జనరల్) కేటగిరీ నుండి రూ.800, SC, ST కేటగిరీ అభ్యర్థులు రూ.500 నాన్-రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. అక్టోబర్ 30న తరగతులు ప్రారంభం కానున్నాయి.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ చెల్లింపుతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేసేందుకు సెప్టెంబర్ 20 ను...
చీరపై 20 దేశాధినేతల చిత్రాలు, G20 లోగో.. సిరిసిల్ల కళాకారుడి అద్భుత ప్రతిభ

చీరపై 20 దేశాధినేతల చిత్రాలు, G20 లోగో.. సిరిసిల్ల కళాకారుడి అద్భుత ప్రతిభ

Telangana
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సును పురస్కరించుకొని రాజన్న సిరిసిల్లకు జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు తన ప్రతిభతో అద్భుతమైన కళారూపాన్ని తయారు చేశాడు. ఈ చేనేత కార్మికుడు జి20 సదస్సులో దేశాధినేతల చిత్రాలు, భారతీయ చిహ్నాన్ని రెండు మీటర్ల పొడవు గల వస్త్రంపై చూడచక్కగా నేశాడుతెలంగాణలోని రాజన్న సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు (sircilla handloom worker) వెల్ది హరి ప్రసాద్ దేశ విదేశాలకు చెందిన G20 నాయకులను రెండు మీటర్ల క్లాత్ పై నేయడం ద్వారా తన అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2 మీటర్ల పొడవు ఉన్న ఈ ఫాబ్రిక్ పై భారతీయ చిహ్నం, జీ20 లోగోను కూడా చూపుతుంది. హరి ప్రసాద్ రెండు మీటర్ల పొడవు వస్త్రం పూర్తి చేయడానికి అతనికి వారం రోజులు పట్టింది. ఈ కళాఖండంలో PM మోడీ, హిందీ ఫాంట్‌లో అల్లిన 'నమస్తే' అని రాసి ఉన్నాయి. ప్రసాద్ తన కళాఖండాన్ని ప్రధానితో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.ఇదిలా ఉం...
గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

Telangana
Hyderabad Rains:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్  25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు  చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే ముందు ప్రజల భద్రత, కనీస ప్రాథమిక వసతులను మెరుగుచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రెండు రోజుల వర్షానికే డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లో పడి ప్రజలు చనిపోతున్నప్పుడు హైదరాబాద్ నిజంగా ప్రపంచ నగరంగా మారిందని ఎలా భావించగలం. ప్రతీ సంవత్సరం  వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారులులన్నీ పడవ  ప్రయాణా...
హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకతల స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేసింది…

హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకతల స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేసింది…

Telangana
హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వారధులను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన (Steel Bridge) శనివారం అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ నేత, కార్మిక నాయకుడు, మాజీ మంత్రి అయిన నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం ఈ వంతెనకు ఆయన పేరు పెట్టారు. ఇందిరా పార్క్‌ చౌరస్తా (Indira Park) నుంచి ఆర్టీసీ బస్‌ భవన్ సమీపంలోని వీఎస్టీ చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఫలితంగా ఆర్టీసీ క్రాస్‌రో డ్స్‌, అశోక నగర్‌, వీఎస్టీ (VST) జంక్షన్ల ప్రాంతంలో ఏర్పడే ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎన్నో ప్రత్యేకతలుదక్షిణ భారత దేశంలోనే ఇది మొదటి పొడవైన స్టీల్‌ బ్రిడ్జ్‌. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి మరో ప్రత్యేకత ఉంది. మొదటిసార...
ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Telangana
ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్న్యూ ఢిల్లీ: హైదరాబాద్ , బెంగళూరులను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vande bharath Express) 25 ఆగస్టు, 2023న ప్రారంభించనున్నారు. ఇది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నడిచే ప్రస్తుత రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలా కాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.హైదరాబాద్ - బెంగళూరు హైదరాబాద్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలో ప్రారంభం కానుంది. ఇది హైదరాబాద్, బెంగళూరులను కలుపుతుంది, 615 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల 15 నిమిషాల్లోనే చేరుకుంటుంది. ఈ హై-స్పీడ్ సర్వీస్ భారతదేశంలోని రెండు ప్రముఖ సాఫ్ట్‌వేర్ హబ్‌లు అయిన హైదరాబాద్ బెంగుళూరు మధ్య కీలకమైన నగరాలను కలపుతుంది. బెంగళూరు-హైదరాబాద్ వందే భారత్: స్టాప్‌లు అంచనా హైదరాబాద్‌కు రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేడం, రాయచూర్ జంక్షన్ ,  గుంతకల్ జంక్షన్‌లో షె...
సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత

సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత

Telangana
హైదరాబాద్: ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ వీఎం కృష్ణారావు (64) గురువారం కన్నుమూశారు. కృష్ణారావుకు 47 ఏళ్ల అపారమైన అనుభవంతో జర్నలిజంలో అమూల్యమైన సేవలందించారు. ఈ రంగంలో ఆయన ప్రయాణం 1975లో ఒక స్టింగర్ గా ప్రారంభమైంది. ప్రతిభ, స్వశక్తితో వేగంగా ఉన్నతస్థానాలకు ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో సహా పలు పత్రికల్లో ఆయన తన పనితీరుతో ఆంగ్ల, తెలుగు దినపత్రికలపై చెరగని ముద్ర వేశారు. డెక్కన్ క్రానికల్ లో న్యూస్ బ్యూరో చీఫ్ గా 18 సంవత్సరాలకు పైగా పని చేశారు. ఆత్మీయులందరూ “బాబాయి” అని ముద్దుగా పిలుచుకునే కృష్ణారావు.. చురుకైన ఆలోచనలు ఆయనకు పాత్రికేయ వర్గాల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. కాగా విషాదకరంగా, గత ఏడాది క్యాన్సర్ బారినపడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆయన గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు మనుమలు...
మొబిలిటీ రంగంలో అగ్రగామిగా తెలంగాణ

మొబిలిటీ రంగంలో అగ్రగామిగా తెలంగాణ

Telangana
మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్‌ ఉందని మంత్రి కేటీ ఆర్‌ (KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని తెలిపారు. ఎలక్ట్రికల్‌ వాహన రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు ((E-Batteries)) దేశంలోనే తయారవుతాయన్నారు. గిగా కారిడార్ లో భాగంగా హైదరాబాద్ లోని జీఎంఆర్‌ ఏరో సిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి కేటీఆర్ శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిందన్నాని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric vehicles) కోసం జహీరాబాద్ పట్టణాన్ని ఎంపిక చేశామని తెలిపారు. యువ నైపుణ్యాలను ఒడిసిపట్టడంలో టీఎస్ ఐసీ కృషి చేస్తోందని ప్రశంసించారు. పరిశోధన, డిజైనింగ్, ఇంజినీరి...
ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

Telangana
 హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి బ్రేక్ పడింది. విలీనానికి అన్ని చట్టపరమైన సమస్యలను పరిశీలించిన తర్వాతే బిల్లుపై సంతకం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేయడంతో దానికి ఆమోదముద్ర పడలేదు. దీనికి మరికొంత సమయం అవసరమని గవర్నర్ పేర్కొన్నారు. పర్యవసానంగా, ఆదివారంతో ముగియనున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ యోచనలు బెడిసికొట్టాయి.కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నందున, ఎన్నికలకు ముందు చివరి సెషన్‌లో టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు లేనట్టే.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం సభలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించినా.. దానికి గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. తర్వాత తేదీలోగానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి ...
తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు

తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు

Telangana
హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు(Vande Bharat Express)ను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ నుంచి తరచుగా బెంగళూరుకు ప్రయాణించే వారి కోసం కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య కొత్తగా వందే భారత్ (VB) ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) రంగం సిద్ధం చేస్తోంది .ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ నెలాఖరులో వర్చువల్ మోడ్‌లో తాజా VB ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే SCR అధికారులు ఇంకా లాంచ్ ఈవెంట్ గురించి అధికారికంగా వివరాలను వెల్లడించలేదు.కాగా కాచిగూడ - యశ్వంత్‌పూర్ మధ్య VB ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి ప్రవేశపెట్టబడిన మూడవ రైలు అవుతుంది. గతంలో ప్రారంభించిన మొదటి రెండు VB ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం తిరుపతికి ప్రవేశపెట్టారు..కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు జరు...