Transfers In Telangana | రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం
మరో 74 మంది మున్సిపల్ కమిషనర్‌లు బదిలీ
Transfers In Telangana | హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు మున్సిపల్ కమిషనర్ల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం 40 మందిని బదిలీ (Transfers In Telangana) చేస్తూ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే బుధవారం మరో 74 మందికి ప్రభుత్వం స్థాన చలనం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర పురుపాలక శాఖ.. ఈ బదిలీలను చేపట్టింది. అయితే ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో కూడా భారీగా బదిలీలు చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖలో మొత్తం 105 మంది అధికారులను బదిలీ చేశారు. సోమవారం జారీ చేసిన ఉత్తర్వులతో సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేశారు.
14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లును తెలంగాణ ఆబ్కారీశాఖలో బదిలీ చేశారు. ఇద్దరు ఉప కమిషనర్ల తో పాటు 9 మంది సహాయ కమిషనర్లకు ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 132 మంది తహశీల్దార్లు బదిలీ అయ్యారు. వారితో పాటు 32 మంది డిప్యూటీ కలెక్టర్‌లు (ఆర్డీవో) లు బదిలీ చేశారు.
రాష్ట్రంలో భారీ ఎత్లున డీఎస్పీల బదిలీ
Police Transfers : రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆబ్కారీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ లో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీచేసింది. తాజాగా పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్నా, లేదా సొంత జిల్లాల్లో పని చేస్తున్న అధికారులకు ట్రాన్స్ ఫర్ చేయాలని ఎన్నికల కమిషన్ డిసెంబర్‌లో ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులకు బదిలీలు చేపడుతున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..