Telangana Cabinet Decisions : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ప్రధానంగా మూసీ ప్రక్షాళన చర్యలు, హైడ్రా, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపు, కొత్త రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించింది. దీంతోపాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ఏటూరునాగాారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మద్నూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంచాలని తీర్మానించారు. అలాగే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేబినెట్ (Telangana Cabinet) ఆమోదముద్ర వేసింది. హయత్‌నగర్ – ఎల్బీనగర్, నాగోల్ – ఎల్బీనగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకూ మెట్రో రైలు సర్వీసులను విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది.
కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- సన్న బియ్యానికి రూ.500 బోనస్
- ములుగులో సమ్మక్క-సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటికి ఎకరం రూ. 250కే భూముల కేటాయింపు
- కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్
- హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపు
- రెవెన్యూ డివిజన్ గా ఏటూరు నాగారం
- ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటు
- రేరాలో 54 ఉద్యోగాలు భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు
- రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి రుణ సేకరణ
- ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..