
బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు.. పార్టీని వీడినా నష్టం లేదు : రామచందర్రావు
Telangana BJP | హైదరాబాద్ : బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramachandra Rao) స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్నవారికి బీజేపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని అందుకు తాను ఒక ఉదాహరణ అని అన్నారు.పార్టీ అభివృద్ధికి పని చేసిన ప్రతీఒక్కరికీ కచ్చితంగా అవకాశాలు వస్తాయని తెలిపారు. కాగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విధానాలు నచ్చనివారు పార్టీని వీడినా నష్టం లేదంటూ కుండబద్దలు కొట్టారు.
రాజాసింగ్‌కు చెక్ పెడుతుందా?
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీ (Telangana BJP)కి కొరకారని కొయ్యగా మారిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh)కు చెక్ పెట్టేందుకు బీజేపీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తీరుపై కేంద్ర నాయకత్వం మీద ఫైర్ అయిన రాజాసింగ్ ఏకంగా పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈమేకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాజీనామ లేఖ అందజేశారు. ఈ లేఖ ఆధారంగా స్పీకర్‌కు లేఖ రాసి తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించాలని కోరారు. దీంతో ఇదే అదునుగా ఆయనను పార్టీ నుంచి తప్పించాలని పలువురు నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.