Netflix Subscription | జియో, ఎయిర్ టెల్ రీచార్జి ప్లాన్లలో కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కలిగిన బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏదీ..?
Jio, Airtel, Viతో సహా భారతదేశంలోని అన్ని ప్రధాన టెలికాం ఆపరేటర్లు జూలై 3 నుంచి తమ టారిఫ్ ప్లాన్‌లను పెంచారు. ఈ అప్‌డేట్‌లో భాగంగా, ఈ కంపెనీలు ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్‌లతో అందించే ప్రయోజనాలను తగ్గించాయి. మరికొన్నింటిని నిలిపివేసాయి. మీరు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ( Netflix Subscription) కలిగిన రీఛార్జ్ ప్లాన్ కోసం వెతుకుతున్నారా..? అయితే Netflix ప్రయోజనాలను అందించే Jio. Airtel నుంచి రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాను ఇక్కడ చూడండి. ఏ ప్లాన్‌లు మరింత సరసమైనవో గుర్తించడంలో ఈ కథనం మీకు ఉపయోగపడవచ్చ.జియో నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కలిగి ఉన్న రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒక ప్లాన్ మాత్రమే కలిగి ఉంది. జియో ప్లాన్‌ల ధర రూ. 1,799, రూ. 1,299 కాగా, ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ. 1,798. ఈ ప్లాన్ ను అందిస్తోంది.
జియో రూ. 1,799 ప్రీపెయిడ్ ...