TCS to open its office in Visakhapatnam | విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS in Vizag) 10వేల మంది యువతకు మెరుగైన జీతభత్యాలతో ఉద్యోగాలు లభించనున్నాయి. యువనేత నారా లోకేష్ (Nara Lokesh) గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగాలిప్పిస్తానని ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా యత్నాలను ముమ్మరం చేశారు. ఈమేరకు తాజాగా టాటా గ్రూపు చైర్మన్, సంస్థ ప్రతినిధులను ఒప్పించి విశాఖకు టీసీఎస్ ని తీసుకొచ్చారు. ముంబై మహానగరంలోని టాటా సన్స్ ఆఫీస్ బాంబే హౌస్ లో టాటా సన్స్ చైర్మన్ ఎం.చంద్రశేఖరన్‌తో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎంవో అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా, టాటా గ్రూప్ అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, విశాఖలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ సవివరంగా వెల్లడించారు. వెంటనే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ తమ సెంటర్‌ను విశాఖ (TCS in Vizag ) లో నెలకొల్పుతామని, 10వేల ఉద్యోగాలు కల్పిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. ఏపీలో ఈవీ, ఎయిరో స్పేస్, స్టీల్, హోటల్స్, టూరిజం రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిస్తామని టాటా గ్రూప్ మంత్రి నారా లోకేష్‌కి వివరించింది.
భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖలో ఏర్పాటుచేసి 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ కంపెనీలకు స్వాగతం పలుకుతోందని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో తమ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు టీసీఎస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి తొలి అడుగు అవుతుందని హర్షం ప్రకటించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..