Saturday, April 19Welcome to Vandebhaarath

Tata EV | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon, Punch EVల‌పై రూ. 3 లక్షల వరకు తగ్గింపు

Spread the love

Tata EV | టాటా మోటార్స్ త‌న‌ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ (Festival of Cars) కార్యక్రమంలో భాగంగా, టాటా  ఈవీలలో  అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లతో స‌మానంగా ఉంద‌ని టాటా పేర్కొంది. ఆఫ‌ర్ లో భాగంగా రూ.3 లక్షల వరకు ఆదా చేసుకోవ‌చ్చు. అదేవిధంగా Punch.ev ఇప్పుడు రూ.9.99 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్ ను  అందిస్తోంది. ఇది మార్కెట్లో అత్యంత సరసమైన Electric SUVలలో ఒకటిగా నిలిచింది.

Tiago.ev కూడా ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉంది. అయితే దీని ధర ₹7.99 లక్షల వద్ద ఎటువంటి మార్పు లేదు. సాంప్రదాయ అంతర్గత దహన ఇంజిన్ (ICE) వాహనాలతో స‌మానంగా తమ EVలను అందిస్తున్నట్లు టాటా పేర్కొంది. ఇది EV అడాప్షన్‌కు ఉన్న కీలకమైన అడ్డంకులను అధిగమించగలదని భావిస్తున్నారు

READ MORE  Bajaj CNG Bike | ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తోంది.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ..

ఉచిత ఛార్జింగ్

మరోవైపు టాటా మోటార్స్ దేశమంతటా 5,500 టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో 6 నెలల పాటు ఉచిత ఛార్జింగ్‌ సౌకర్యాన్ని అందిస్తోంది. ఎక్కువ మంది ఈవీలకు మారేలా ప్రోత్సహించడం ద్వారా టాటా మోటార్స్ ను మరింత మెయిన్ స్ట్రీమ్‌గా మార్చడం టాటా లక్ష్యం. కంపెనీ ప్రకారం.. ఈ ప్రత్యేక ధరలు పెట్రోల్ లేదా డీజిల్ కార్ల వలె EVలను స‌ర‌స‌మైన‌విగా మార్చ‌నున్నాయి.

ఈ డిస్కౌంట్ ఆఫర్‌లు 31 అక్టోబర్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. Tata EV  “ఫెస్టివల్ ఆఫ్ కార్స్” ఈవెంట్ EVలకు మారడానికి ఆసక్తి ఉన్న వారికి ఇది చ‌క్క‌ని అవ‌కాశం. ధరలు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మోడళ్లతో స‌మానంగా ఉంటాయి.

READ MORE  New Tata Nano | టాటా నానో మళ్లీ వస్తుందా? టాటా మోటార్స్ కొత్త నానో కారులో ఏయే ఫీచర్లు ఉంటాయో తెలుసా..?

ధరల సారాంశం:

• Tiago.ev: రూ.7.99 లక్షలతో ప్రారంభం (ధర మారదు)
• Punch.ev: రూ.9.99 లక్షలతో ప్రారంభం (రూ. 1.20 లక్షల వరకు ఆదా )
• Nexon.ev: రూ.12.49 లక్షలతో ప్రారంభం (రూ. 3 లక్షల వరకు ఆదా )


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *