కుళ్లిపోయిన మటన్‌తో బిర్యానీ.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై కేసు

కుళ్లిపోయిన మటన్‌తో బిర్యానీ.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై కేసు

Taskforce Checkings : జీహెచ్ఎంసీ పరిధిలోని పలు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం రాత్రి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో (Secunderabad Alpha Hotel) ఆస్మికంగా సోదాలు చేయగా నాసిరకం ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోతున్న మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో వండి ఫ్రిడ్జ్‌లో పెట్టి కస్టమర్లు వచ్చినపుడు దానిని వేడి చేసి అందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇక్కడ నాసిరకమైన టీ ఫౌడర్ ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్‌లో తయారు చేసే బ్రెడ్‌, ఐస్‌క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని అధికారులు తేల్చారు. కిచెన్‌లో పరిసరాలు అత్యంత దారుణంగా అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో హోటల్ కేసు నమోదు చేసి రూ.లక్ష వరకు జరిమానా విధించారు అధికారులు.


Taskforce Checkings : ఇక సికింద్రాబాద్‌లోని సందర్శిని హోటల్‌లోనూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన నూడుల్స్ ప్యాకెట్, అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలను అధికారులు గుర్తించారు. రాజ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేయగా అక్కడి కిచెన్‌లో ఎలుకలు తిరుగుతున్నాయని   అధికారులు తెలిపారు. బార్ యాజమాన్యంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు, మాదాపూర్, అమీర్ పేట్, ఎస్సార్ నగర్ ఇలా కొన్ని ప్రాంతాల్లోని హాస్టళ్లను సైతం టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. కిచెన్లలో అపరిశుభ్ర పరిస్థితులను గమనించిన ఆగ్రహం వ్యక్తం చేశారు.


 

READ MORE  Telangana Budget | కౌలు రైతులకు త్వరలో రుణమాఫీ, ఉచిత కరెంట్ పథకానికి నిధుల కేటాయింపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *