
Macaulay |మెకాలే సంకెళ్లు తెంచుకుందాం: PM మోదీ పిలుపు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరంలో పవిత్ర జెండాను ఎగురవేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 1835 నాటి లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 200వ వార్షికోత్సవానికి ముందు, ఆ 'బానిసలుగా ఉన్న భారతీయ విద్యావ్యవస్థను పూర్వవైభవం తీసుకురావవానికి ప్రతి భారతీయుడు 10 సంవత్సరాల ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన కోరారు.ఈసందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, "1835 నాటి ఇంగ్లీష్ విద్యా చట్టం ద్వారా మెకాలే మన ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశాడు. భారతీయ విద్యావ్యవస్థను చెత్తబుట్టలో పడేశాడు. పాశ్చాత్య విద్యావ్యవస్థను అవలంబించాలని మనల్ని నమ్మించింది," అని అన్నారు. వలసవాద మనస్తత్వం యొక్క సంకెళ్ల నుండి బయటపడాలని, తద్వారా 2047 నాటికి 'అభివృద్ధి చెందిన భారతదేశం' కలను సాధించవచ్చని ఆయన ఉద్ఘాటించారు.రాముడి విలువలు, మానసిక బానిసత్వం"రాముడు ఒక సంపూర్ణ విలువల వ్యవస్థను కలిగి ఉన్నాడు. ప్రత...
