
25 ప్రధాన తీర్మానాలతో ఎన్‌డీఏ మేనిఫెస్టో విడుదల – Bihar NDA Manifesto 2025
Bihar NDA Manifesto 2025 : బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఈరోజు తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ "సంకల్ప్ పాత్ర"ను పాట్నాలోని హోటల్ మౌర్యలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమక్షంలో విడుదల చేశారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కూటమి భాగస్వాములు చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టో ప్రధానంగా ఉద్యోగ కల్పన, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెట్టింది.ఇది సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా మహిళలు, యువతకు అనేక హామీలు ఇచ్చింది. రైతులకు నెలవారీ ₹3,000 చెల్లింపులు, ఏడు ఎక్స్‌ప్రెస్‌వే లు, ఉచిత విద్యుత్, వైద్య చికిత్స, శాశ్వత ఇళ్ళు, కర్పూరి ఠాకూర్ సమ్మాన్ నిధి తదితర హామీలు NDA మెనిఫెస్టోలో పొందుపరిచారు.25 ప్రధాన అంశాలపై ఎన్డీఏ ప్రజల్లోకిఈ మేనిఫెస్టో బీహార్ రాష్ట్రానికి దిశానిర్దేశం...

