Wednesday, April 23Welcome to Vandebhaarath

Tag: WHO

Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..
Life Style

Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..

Mpox Outbreak | ప్రపంచవ్యాప్తంగా MPOX కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, భార‌త్ అల‌ర్ట్ అయింది. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి స‌మీక్షిస్తోంది. . భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు ఏవీ న‌మోదైన‌ట్లు నివేదించలేదు. అయితే వ్యాధి వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి ముంద‌స్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్ల‌డించింది. ఇదిలావుండ‌గా MPOX వ్యాప్తిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిని అత్యవసరంగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పిలుపునిచ్చింది. భార‌త్ లో వైర‌స్ వ్యాప్తి త‌క్కువే.. శ‌నివారం జ‌రిగిన‌ సమీక్ష సమావేశంలో, రాబోయే వారాల్లో కేసులు న‌మోద‌య్యే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమ‌ని ప్రస్తుతం భారతదేశంలో మ‌హ‌మ్మారి భారీ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. డబ్ల్యూహ...
Corbevax Vaccine ‌: హైదరాబాద్ కోర్బీవ్యాక్స్ టీకాకు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి
National

Corbevax Vaccine ‌: హైదరాబాద్ కోర్బీవ్యాక్స్ టీకాకు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి

 Corbevax Vaccine ‌: హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్ ఈ సంస్థ దేశీయంగా తయారు చేసిన కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకా (Corbevax Vaccine) కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొటీన్ సబ్ యూనిట్ ఫ్లాట్ ఫాంపై స్వదేశీయంగా రూపొందించిన తొలి దేశీ కొవిడ్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. కోర్బీవ్యాక్స్ టీకాను అత్యవసర వినియోగం కింద ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. కోర్బీవ్యాక్స్ కు ఇప్పటికే డీసీజీఐ అనుమతి లభించింది. ఇప్పటివరకు సుమారు 100 మిలియన్ల కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి బయోలాజికల్ ఈ సంస్థ అందించింది. ఈ టీకాను ఎక్కువగా 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల కోసం వినియోగించారు. కాగా తమ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ ఎమర్జెన్సీ లిస్టింగ్ రావడం సంతోషకంగా ఉందని బీఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ ధాట్ల పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ వో లిస్టింగ్ తో తమ కంపెనీ కొవిడ్ 19 టీకాల ఉత్పత్త...
డేంజర్ బెల్స్: నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి నిర్ధారణ
National

డేంజర్ బెల్స్: నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి నిర్ధారణ

Japanese encephalitis : కేరళలోని కోజికోడ్‌లో నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో ల్యాబ్ పరీక్షలో నాలుగేళ్ల బాలుడికి ఇన్‌ఫెక్షన్‌కు పాజిటివ్ అని తేలింది. శాంపిల్స్‌ను పూణే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. జూలై 15న తీవ్రజ్వరం, తలనొప్పి, తీవ్రమైన మెడ నొప్పి వంటి లక్షణాలతో బాలుడిని అడ్మిట్ చేశారు. కాగా "జపనీస్ ఎన్‌సిఫిలైట్స్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది, పిల్లలు ఎక్కువగా దీని బారిన పడతారు" అని ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాయా సుధాకర్ తెలిపారు.బాధిత చిన్నారి ప్రభుత్వ వైద్య కళాశాలకు కిలోమీటరు దూరంలోని చేవాయూర్‌లోని చేవారంబలం నివాసి. "సంక్రమణ మరణాల రేటు ఎక్కువగా ఉన్నందున, వ్యాప్తి సంభవించిన ప్రాంతాన్ని శానిటైజ్ చేయాల్సి ఉంది. జపనీస్ ఎన్...