Monday, September 1Thank you for visiting

Tag: WHAP Vehicle

కాశ్మీర్ లోయలో అడుగుపెట్టిన అత్యాధునిక WhAP వాహనం

కాశ్మీర్ లోయలో అడుగుపెట్టిన అత్యాధునిక WhAP వాహనం

National
WHAP Vehicle : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోసం భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక WHAP Vehicle ను రంగంలోకి దించింది. ఈ WHAP వాహనానికి (Wheeled Armored Amphibious Platform ) భూమి, నీరు, అలాగే చిత్తడి నేలలు, సరస్సులు, మడుగులపై  నుంచి కూడా ప్రయాణించే సత్తా కలిగి ఉంటుంది. ఈ వాహనాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), TATA సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందులో డ్రైవర్‌తో సహా 12 మంది సైనికులను తీసుకెళ్లవచ్చు. బాంబు పేలుళ్లు, బులెట్ల వర్షాన్ని తట్టుకునే సత్తా.. 'వీల్డ్ ఆర్మర్డ్ యాంఫిబియస్ ప్లాట్‌ఫాం' (WHAP) బుల్లెట్ల వర్షం, బాంబు పేలుళ్లు, రాకెట్‌లను సైతం తట్టుకోగల ఒక బలిష్టమైన యంత్రం. ఇది శక్తివంతమైన 600-హార్స్పవర్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, అలాగే ఖచ్చితమైన షూటింగ్ కోసం 7.62 mm రిమోట్ కంట్రోల్డ్ వెపన్ స్టేషన్ (RCWS...