Friday, January 3Thank you for visiting

Tag: water crisis

Delhi Water crisis | తాగునీటి ఎద్ద‌డితో అల్లాడుతున్న ఢిల్లీ వాసులు

Delhi Water crisis | తాగునీటి ఎద్ద‌డితో అల్లాడుతున్న ఢిల్లీ వాసులు

National
Delhi Water crisis  | దేశ రాజధానిలో ఢిల్లీలో తాగునీటి కొర‌త ప్ర‌జ‌ల‌ను వేధిస్తోంది. గుక్కెడు నీటి కోసం అంద‌రూ అల్లాడిపోతున్నారు. నీటి కొరత ఉన్న నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక నెల పాటు అదనంగా నీటి సరఫరాను కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశ రాజధానిలో వేడిగాలుల పెరిగాయ‌ని, నీటి అవసరం కూడా గ‌ణ‌నీయంగా పెరిగిందని ఢిల్లీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో తన పిటిషన్‌లో పేర్కొంది. మండుతున్న వేడిలో దేశ రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొంది.హర్యానా అవసరమైనంత నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ మంత్రి అతిషి కేంద్రానికి లేఖ కూడా రాశారు. "దిల్లీ తన రోజువారీ నీటి డిమాండ్ కోసం యమునా నది నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంది. అయితే, హర్యానా వజీరాబాద్ బ్యారేజీని విడుదల చేయకపోవడంతో గత కొన్ని రోజులుగా, వజీరాబాద్ బ్యారేజీ వద్ద నీటి మట్...
water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

water crisis | దేశంలో మరో ఐదు నగరాలకు నీటి కష్టాలు

National
water crisis in indian cities | వేసవి వచ్చీరాగానే ఎండలు తీవ్రమై  అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నీటి కొరత బెంగళూరులోనే  కాదు.. ఇది భారతదేశంలోని  అనేక ప్రధాన నగరాలను వేధిస్తోంది. సమీప భవిష్యత్తులో పలు నగరాలు, పట్టణాల్లో  తీవ్రమైన నీటి కొరతతో ప్రజలు సతమతం కానున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా దేశంలోని ఐదు నగరాల్లో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.. ఆ నగరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ముంబై: పెరుగుతున్న నీటి డిమాండ్, అస్థిరమైన వర్షపాతం, తగ్గుతున్న నీటి వనరులతో, నగరం తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వేగవంతమైన పట్టణీకరణ, సరిపడని మౌలిక సదుపాయాలు,  అసమర్థమైన నీటి నిర్వహణ విధానాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో నీటి నిల్వలు తగ్గిపోవడం..  ప్రత్యామ్నాయ నీటి వనరుల కొరత కారణంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BM...