Tuesday, December 30Welcome to Vandebhaarath

Tag: warangal

హైందవ విలువల పునరుద్ధరణకు మహిళలే మార్గదర్శకులు
Telangana

హైందవ విలువల పునరుద్ధరణకు మహిళలే మార్గదర్శకులు

దేశం శక్తివంతంగా ఉండాలంటే సమాజంలో ఐక్యత అవసరంసనాతన ధర్మ పునరుద్ధరణ ప్ర‌తీ ఇంటి నుంచి మొద‌లు కావాలిరాష్ట్ర సేవికా స‌మితి తెలంగాణ ప్రాంత స‌హకార్యవాహిక పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మిRashtra Sevika Samiti : వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లా రాష్ట్ర సేవికా స‌మితి (Rashtra Sevika Samiti) విజ‌య‌ద‌శ‌మి ఉత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. వ‌రంగ‌ల్ లోని కె క‌న్వెన్ష‌న్ హాలులో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ముఖ్యఅతిథిగా ప్ర‌ముఖ గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్‌ గుజ్జుల సౌమ్య‌, ముఖ్య వ‌క్త‌గా రాష్ట్ర సేవికా స‌మితి తెలంగాణ ప్రాంత స‌హకార్యవాహిక పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మి హాజ‌రయ్యారు. అలాగే వ‌రంగ‌ల్ జిల్లా కార్య‌వాహిక మ‌ద్దాల అర్చ‌న‌, హ‌న్మ‌కొండ జిల్లా కార్య‌వాహిక స‌ముద్రాల క‌విత, రాష్ట్ర సేవికా స‌మితి ప్రాంత వ్యవస్థా ప్రముఖ్, వరంగల్ విభాగ్ పాలక అధికారి గుదిమెళ్ళ అనంతలక్ష్మి, ప్రాంత కుటుంబప్రబోధన్ గతివిధి ప్రముఖ్, షహమీర్ జ్య...
RSS |  సేవ, క్రమశిక్షణ, దేశభక్తి – సంఘ్ మూల సూత్రాలు
Local

RSS | సేవ, క్రమశిక్షణ, దేశభక్తి – సంఘ్ మూల సూత్రాలు

హిందూ సమాజ ఐక్యతే బలమైన భారత నిర్మాణానికి పునాదిసమాజంలో కుట్రలు – హిందువులను విడదీసే ప్రయత్నాలు పెరుగుతున్నాయ్కుటుంబ వ్యవస్థే భారత బలం – ఇత‌ర దేశాలకు ఆదర్శంప్రొఫెసర్ మామిడాల ఇస్తారికేయూ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారిWaragnal : దేశ నిర్మాణంలో తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) హిందూ సమాజ ఐక్యతను ముందుకు తీసుకువెళ్తోంద‌ని ఆర్ఎస్ఎస్‌ వ‌రంగ‌ల్ విభాగ్ స‌హ‌ కార్య‌వాహ్, కేయూ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారి అన్నారు. భారతదేశాన్ని బలమైన, సుసంస్కృత, ఆత్మవిశ్వాసంతో కూడిన హిందూ రాష్ట్రముగా తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని ఆయ‌న పేర్కొన్నారు. వరంగల్ 16 వ డివిజన్ కీర్తి నగర్ లోని కోటిలింగాల బస్తీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగు...
Kazipet : కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తో వరంగల్​ అభివృద్ధి పరుగులు
Telangana

Kazipet : కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తో వరంగల్​ అభివృద్ధి పరుగులు

అశ్వినీ వైష్ణవ్ పర్యటనతో మళ్లీ చర్చలోకి వచ్చిన కాజీపేట యూనిట్మూడు వేల మందికి ఉపాధి అవకాశాలుKazipet | సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని, నేడు ఆ కల నెరవేరబోతోందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని మంజూరు చేశారని ఆయన గుర్తుచేశారు. కాజీపేటలోని రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (Kazipet Railway Coach Factory )పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మాట్లాడారు.ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడికి వచ్చి భూమిపూజ చేశారని, ఈ యూన...
Ekadashi – 2025 | శాకంబ‌రీ అలంకారంలో నిమిషాంబ దేవి అమ్మవారు: భక్తుల రద్దీతో ఆలయంలో సందడి
Local, Telangana

Ekadashi – 2025 | శాకంబ‌రీ అలంకారంలో నిమిషాంబ దేవి అమ్మవారు: భక్తుల రద్దీతో ఆలయంలో సందడి

భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కుంకుమ పూజ‌లువ‌రంగ‌ల్ 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్ బోర్డ్ కాల‌నీలోని నిమిషాంబ దేవి (Nimishamba Temple) ఆల‌యంలో ఆదివారం ఏకాద‌శి (Ekadashi ) పూజ‌లు వైభ‌వంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో భాగంగా ఆల‌యంలో అమ్మ‌వారు శాకంబ‌రిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. దీంతో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు హాజ‌రై అమ్మ‌వారిని ద‌ర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మ‌హిళ‌లు నిమిషాంబ దేవి అమ్మ‌వారి స‌న్నిధిలో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కుంకుమ పూజ‌లు చేశారు. ఆల‌య అర్చ‌కులు లక్ష్మీనరసింహ చార్యులు, శాస్త్రోక్తంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.కార్య‌క్ర‌మంలో ఆల‌య‌ కమిటీ సభ్యులు కె. సురేష్ అధ్యక్షులు, వెంకటేశ్వర్ వర్మ, సంతోష్ బాబు, విజయరాజ్, సునీల్ కుమార్, సంజయ్ కుమార్, రమేష్, రాందాస్, వెంకటేశ్వర్లు, సుగుణాకర్ తోపాటు స్థానిక కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, కళ్యాణి, శోభారాణి, కావిక...
Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప‌నులు
National

Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప‌నులు

కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ పున‌రాభివృద్ధి ప‌నులు (Warangal Railway Station) శ‌ర‌వేగంగా కొస‌సాగుతున్నాయి. వ‌రంగ‌ల్ రైల్వేస్టేష‌న్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.25.41 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే (Indina Railways) స్టేష‌న్ ముఖ ద్వారం సుంద‌రీక‌రించ‌డంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్నారు.ఇప్పటికే ఓరుగల్లు రైల్వేస్టేషన్ ముందు భాగాన్ని కాకతీయుల కళావైభవం, వారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చదిద్దారు.. సాయంత్రం వేళ విభిన్న రకాల రంగురంగు లైట్లతో స్టేషన్ వెలిగిపోతూ ప్రయాణికులను, బాటసారులను ఆకర్షిస్తోంది.ఇక రైల్వే స్టేషన్ లోపల ప్రయాణీకులు సులభంగా రాకపోకలు సాగించేందుకు, రద్దీని తగ్గించడానికి 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మిస్తున్నారు. అధునాతన రెస్ట్ రూమ్ లు ర...
Earthquake in Telangana | తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం, ములుగు కేంద్రంగా ప్ర‌కంప‌ణ‌లు
Auto, Telangana

Earthquake in Telangana | తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం, ములుగు కేంద్రంగా ప్ర‌కంప‌ణ‌లు

Earthquake in Telangana | తెలుగు రాష్ట్రాల్లో బుధ‌వారం ఉద‌యం భూ ప్ర‌కంప‌ణ‌లు సంభ‌వించాయి. దీంతో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) ప్రకారం బుధవారం ఉదయం తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. NCS ప్రకారం ఉదయం 7:27 గంటలకు ప్రకంపనలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో NCS పోస్ట్ చేసిన వివ‌రాల ప్ర‌కారం.. "EQ ఆఫ్ M: 5.3, ఆన్: 04/12/2024 07:27:02 IST, చివరి: 18.44 N, పొడవు: 80.24 E, లోతు: 40 కి.మీ, స్థానం: ములుగు, తెలంగాణ.ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచ...
Warangal | గంజాయి నియంత్రణకు వరంగల్ లో  ప్రత్యేకంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్
Telangana

Warangal | గంజాయి నియంత్రణకు వరంగల్ లో ప్రత్యేకంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్

Warangal | తెలంగాణలో మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలల్లో భాగంగా వరంగల్ నగరంలో కొత్తగా  ఏర్పాటు చేసిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ (Warangal Narcotics Police Station) ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నార్కోటిక్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య, శాంతిభద్రతల అదనపు మహేష్ భగవత్, ఎస్పీ సాయి చైతన్య ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ములుగు రోడ్డు లోని ఇండస్ట్రీయల్ ఏరియాలో నూతనంగా నెలకొల్పబడిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ భవనం నుంచి అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ నూతన నార్కోటిక్ పోలీస్ స్టేషన్ తొలి డిఎస్పీ బాధ్యతలు చేపట్టిన సైదులుని నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు ఎస్పీ సాయిచైతన్య అభినందించారు.ఈ సందర్బంగా నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ తెలంగాణ...
Yadadri MMTS | వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్..  త్వరలో యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు..
Telangana

Yadadri MMTS | వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్.. త్వరలో యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు..

Yadadri MMTS | వరంగల్‌లో త్వరలో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజన్లు తయారు చేయాలనేదే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. అలాగే గ్రేటర్ పరిధిలోని ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు పొడిగించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో సమావేశమైయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోపాటు రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎంపీలు కావ్య, రఘనందన్ రావు, డీకే అరుణ లు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న‌ ఎంపీలు వారి నియోకవర్గాల పరిధిలో జరుగుతున్న రైల్వే పనులు, చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ద‌క్...
Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..
Local

Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..

Boddemma Vedukalu 2024 | తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు నెల‌వు. ఇక్క‌డి పండుగ‌ల‌న్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి పండుల్లో బ‌తుక‌మ్మ‌, బొడ్డెమ్మ, బోనాలు, వినాయ‌క చ‌వితి పండుగలు ముఖ్య‌మైన‌వి. ఇందులో ప‌ల్లెల్లో క‌నిపించే బొడ్డెమ్మకు కూడా ఎంతో ప్రాశ‌స్యం క‌లిగి ఉంది. బొడ్డె అంటే చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. బాలికలు మొదలుకొని మహిళలు ఈ వేడుక‌ల్లో పాల్గొంటారు. ఇది కూడా మట్టి, పూలతో తెలంగాణ ఆట‌పాట‌ల‌తో సంబంధం ఉన్న పండుగే. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమ‌య్యాయి. ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు జ‌రుపుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు పిల్ల‌లు బొడ్డెమ్మ‌ను కొలుస్తూ గౌరీదేవిపై పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తుంటారు. తొమ్మిదవ రోజు బొడ్డెమ్మ ఆడిన త‌ర్వాత బొడ్డెమ్మను ద‌గ్గ‌ర‌లోని చెరువులు, కుంటల్లో ...
Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆల‌యంలో 3 నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు..
Local

Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆల‌యంలో 3 నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు..

Sridevi Sharannavarathrotsavam | గ్రేట‌ర్‌ వ‌రంగ‌ల్ ప‌రిధిలోని 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్ బోర్డ్ కాల‌నీలోని ప్ర‌సిద్ధ శ్రీ నిమిషాంబ దేవి (Nimishamba Devi)  అమ్మ‌వారి ఆల‌యంలో అక్టోబ‌ర్ 3 గురువారం నుంచి 12వ తేదీ వ‌ర‌కు దేవీ శ‌ర‌న్న‌వరాత్రోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. మొదటి రోజు 03-10-2024 గురువారం ఉద‌యం 6-00 గంట‌లకు గణపతిపూజ, పుణ్యాహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థాపనం, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయని ఆల‌య క‌మిటీ తెలిపింది.అలాగే 03-10-2024 నుంచి 12-10-2023 విజయదశమి రోజు వరకు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. విజయదశమి శనివారం రోజు ఉదయం అమ్మవారిని అభిషేకించి, కలశ ఉద్వాసన, పూర్ణాహుతి చేసిన తదుపరి అమ్మవారికి విశేషపూజలు అర్చనలు, మంగళరతులు, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 5-00 గంట‌లకు జమ్మిపూజ నిర్వ‌హించ‌నున్నారు. రాత్రి 9-00 గంట...