MMTS: వినాయక నిమజ్జనం వేళ ఎంఎంటీఎస్ శుభవార్త.. 17, 18వ తేదీల్లో రాత్రి కూడా ప్రత్యేక రైళ్లు
MMTS Special Trains : హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు ప్రజలకు నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా ప్రత్యేక సర్వీస్ లను నడిపించేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది. అయితే ప్రత్యేక సర్వీసులు రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు వినాయక నిమజ్జనాలు కూడా వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో భారీగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ప్రయాణికులు భారీగా పెరగనున్నందున ఆ రెండు రోజులు కూడా రాత్రి సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా నిమజ్జనకు నగరవాసులే కాదు.. సమీప జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.ఇ...