
visa free countries 2024లో భారతీయులు వీసా లేకుండా ఈ దేశాలకు హాయిగా వెళ్లవచ్చు
visa free countries | వేసవి కాలం వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ (vacation) కోసం చాలా మంది దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటారు. కొందరైతే విదేశాలకు కూడా వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు, వీసా దరఖాస్తు ప్రక్రియ తరచుగా అడ్డంకిగా మారుతుంది. అయితే మీరు ఈ వేసవిలో వీసా లేకుండా సందర్శించే గలిగే అద్భుతమైన టూరిజం స్పాట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, బ్యాగులను సిద్ధం చేసుకోండి.. ఈ వేసవిలో భారతీయుల కోసం వీసా లేని కొన్ని హాటెస్ట్ పర్యాటక ప్రాంతాలను పరిశీలిద్దాం..థాయిలాండ్
అద్భుతమైన బీచ్‌లు, అతిపెద్ద నగరాలు, పురాతన దేవాలయాలను కలిగి ఉన్న థాయిలాండ్ దేశం ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ గా ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా మిగిలిపోయింది. ఫుకెట్‌లోని మణి జలాల నుండి బ్యాంకాక్‌లోని సందడిగా ఉండే వీధుల వరకు, థాయిలాండ్‌లో చాలా పర్యాటక ప్రాంతాలు అత్యంత ఆకర్షనీయంగ...