గేదెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చిన రైతు
అసలు కారణం ఏమిటీ?
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక రైతు తన గేదె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. అక్కడ తన గేదెను కట్టివేసాడు. తన గేదెపై జరిగిన దాడి గురించి వివరిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా తిర్వా కొత్వాలి ప్రాంతంలోని అహెర్ గ్రామానికి చెందిన సంతోష్ తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. గ్రామంలోని ఒక రైతుకు చెందిన పొలంలో మొక్కజొన్నచేనును ఈ గేదె కొద్ది మొత్తంలో తినేసింది. దీంతో ఆ రైతు గేదెను ముళ్ల తీగతో కట్టేసి తీవ్రంగా కొట్టాడు.విషయం తెలుసుకున్నగేదె యజమాని సంతోష్ ఎలాగోలా తన గేదెను విడిపించుకున్నాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. బాధిత రైతు తన గేదెతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపాడు. తన గేదె మేత కోసం వెళ్తూ వినయ్ అనే రైతు తన పొలంలో మొక్కజొన్నను తినేసిందని చెప్పాడు. ఇద...