Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: Uttam Kumar Reddy

Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు
Telangana

Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు

New Ration Cards |  పేద ప్రజలకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి కబరు చెప్పింది. త్వరలో అర్హులైన నిరుపేదలకు రేషన్‌ ‌కార్డులు, హెల్త్ ‌కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అది కూడా అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, ‌హెల్త్ ‌కార్డులు వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ సమావేశం అనంతరం  మంత్రి ఉత్తమ్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ భేటీలో చర్చించిన విషయాలను విలేఖరులకు వివరించారు.కొత్త రేషన్‌ ‌కార్డుల మంజూరు విషయమై విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్‌ ‌కార్డు అర్హులు ఎవరనేదానిపై త్వరలో జరగనున్న సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్‌ ‌కార్డులను ఎలా మంజూరు చేస్తున్నారనేదానిపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. రేషన్‌ ‌కార్డుల నిబంధనలు ఎలా  ఉండాలని పార్ట...
Fine Rice to Ration Card Holders | పేదలకు గుడ్ న్యూస్.. రేషన్‌ ‌షాపుల్లో సన్న బియ్యం .. గోధుమలు కూడా
Telangana

Fine Rice to Ration Card Holders | పేదలకు గుడ్ న్యూస్.. రేషన్‌ ‌షాపుల్లో సన్న బియ్యం .. గోధుమలు కూడా

Ration Card Holders | హైదరాబాద్ : ‌రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో ‌సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేవలం సన్నబియ్యం మాత్రమే కాదు.. ఇకపై సబ్సిడీ ధరలకు గోధుమలను కూడా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది ప్ర‌భుత్వం. స‌న్న‌బియ్యం పంపిణీపై మంత్రి స‌మీక్ష‌ ఈమేర‌కు హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర స్థాయి విజిలెన్స్ ‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేషన్‌ ‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై అధికారులతో మంత్రి చర్చించారు. పేద ప్ర‌జ‌ల‌కు ఉద్దేశించిన‌ రేష‌న్ బియ్యం పక్కదారి పట్టకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రేషన్‌ ‌డీలర్లను మంత్రి ఉత్త‌మ్‌ హెచ్చరించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి ప్రోత్సాహకాలు అందజేస్తుందని ఆయ‌న‌ హామీ ఇచ్చార...
Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇక‌పై ‘తెల్ల రేషన్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదా?
Telangana

Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇక‌పై ‘తెల్ల రేషన్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదా?

Ration Cards  | సంక్షేమ పథకాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే ముందు త‌ప్ప‌నిస‌రిగా రేష‌న్ కార్డు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధ‌న‌తో రేష‌న్ కార్డు లేని నిరుపేద‌లు ఏ ప‌థ‌కాన్ని కూడా పొంద‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్ర‌భుత్వం తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డుల (white ration card)ను కలిగి ఉండాలనే నిబంధనను తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. గతంలో, కుటుంబాలు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు, ఇళ్ల స్థలాలను పొందేందుకు, స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు తెల్ల రేషన్ కార్డులను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల తర్వాతే కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.ప్రజా పంపిణీ వ్యవస్థ (ప...