Saturday, January 24Thank you for visiting

Tag: Udhampur District

నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపిన చిరుత..

నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపిన చిరుత..

National
Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. చిరుతపులి(leopard) నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపేసింది. ఉధంపూర్ జిల్లా (Udhampur District) లో శనివారం రాత్రి 7-8 గంటల మధ్య జరిగిన ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.సమాచారం అందుకున్న ఉధంపూర్ కంట్రోల్ రూమ్‌.. వెంటనే, బాలికను రక్షించడానికి ఒక బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించింది. ఉదంపూర్‌లోని జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణి విభాగం రేంజ్ అధికారి రాకేష్ శర్మ మాట్లాడుతూ.. “రాత్రి 7-8 గంటల మధ్య, 4 ఏళ్ల బాలికను చిరుతపులి ఎత్తుకెళ్లింది. మాకు సమాచారం అందడంతో ఉదంపూర్ కంట్రోల్ రూమ్ నుంచి బృందాలను పంపించాం. "ఇది చాలా దురదృష్టకర సంఘటన, బాలిక కుటుంబానికి మేము అన్ని సహాయం చేస్తాము," అన్నారాయన. జిల్లాలోని పంచారీ తహసీల్‌లోని అప్పర్ బంజలా గ్రామంలోని బాలిక ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో స్థానికులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని శర్మ త...