Raithu Bharosa : రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల
Raithu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) నిధులు సోమవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ( Raithu Bharosa ) నిధులను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా సోమవారం సుమారు 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు క్రెడిట్ అయినట్లు తెలిసింది. రైతుభరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐదేకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రభుత్వం పలు విడుతలుగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే..మరోవైపు పంట నష్టం నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో రాష...