
Tri-Fold Phone : సాంసంగ్ నుంచి ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్..
Samsung Galaxy S25 సిరీస్ కోసం లాంచ్ ఈవెంట్ సందర్భంగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సాంసంగ్ కొన్ని అత్యాధునిక పరికరాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ (Tri-Fold Phone ) కూడా ఉంది. అదనంగా, శామ్సంగ్ దాని రాబోయే VR హెడ్‌సెట్‌తోపాటు సాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ను టీజ్ చేసింది. ఇది సాంసంగ్ నుంచి వచ్చిన ఫోన్లలో అత్యంత తక్కువ మందం ఉన్న ఫోగా చెప్పబడింది. ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ కంపెనీ షేర్ చేసిన ప్రోటోటైప్‌ను కూడా ప్రదర్శించింది. ఇది Huawei సొంత ట్రిపుల్-ఫోల్డబుల్ మోడల్‌ను పోలి ఉంటుందని భావిస్తున్నారు.ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న Samsung, ఈ వినూత్న పరికరాన్ని ఏడాది చివరి భాగంలో విడుదల చేయాలని భావిస్తోంది. గతేడాది వాణిజ్యపరంగా లాంచ్ అయిన Huawei వెర్షన్ ఈ కేటగిరీలో ...