
BSNL 5G : బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలో 5G సర్వీస్..
BSNL 5G | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL దేశంలో 5G సర్వీస్ ట్రయల్స్ ప్రారంభించింది. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా తన X ( ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసారు. అందులో ఆయన బిఎస్ఎన్ఎల్ 5G నెట్‌వర్క్‌లో వీడియో కాల్ చేయడం చూడవచ్చు. 5G నెట్‌వర్క్‌ను పరీక్షించడానికి మంత్రి సి-డాట్ క్యాంపస్‌లో ఉన్నారు.BSNL కోసం నిధుల కేటాయింపుఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు 82 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. టెలికాం సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారతదేశంలో పూర్తిగా 4G, 5G సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నిధులు వెచ్చించనున్నారు. దీంతో భవిష్యత్తులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బిఎస్ ఎన్ ఎల్ గట్టి పోటీనివ్వనుంది. అయినప్పటికీ, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ నుంచి పోటీ న...