కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ
తమిళనాడులో హృదయవిదారక ఘటన
సృష్టిలో తల్లి ప్రేమ మందు ఏదీ సాటిరాదు. తన పిల్లల కోసం ఏం చేయడానికైనా మాతృమూర్తులు వెనుకాడరు. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేస్తారు. తన కొడుకు కాలేజీ ఫీజులను సమకూర్చేందుకు ఓ మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు కింద పడి ప్రాణాలను తీసుకుంది. పిల్లల ఫీజుల కోసం తనను తాను చంపుకోవడం హృదయాలను కలిచివేసింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన దృశాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.తమిళనాడులో ఓ మహిళ తన కుమారుడి చదువు కోసం డబ్బు సమకూర్చేందుకు బస్సు కిందకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో 'సఫాయి కర్మచారి' (క్లీనింగ్ స్టాఫ్)గా పనిచేస్తున్న ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు ముందు దూకినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది.యాక్సిడెంట్‌లో చనిపోతే తన...