IRCTC refund policy | ప్రయాణికులకు గమనిక.. క్యాన్సిల్ చేసిన టిక్కెట్లపై ఎంత వాపస్ వస్తుందో తెలుసుకోండి..
IRCTC refund policy : దసరా, దీపావళి, ఛత్ పూజ వంటి పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.. రైళ్లలో రిజర్వేషన్ టికెట్ దొరకడం చాలా కష్టం. చాలాసార్లు, బుక్ చేసిన టిక్కెట్లు కూడా 'కన్ఫర్మ్స కావు. అయితే, అనేక సార్లు, ప్రయాణీకులు కూడా తమ జర్నీ ప్లాన్లు మార్చుకోవడం, ఇతరత్రా కారణాల వల్ల టిక్కెట్లను కాన్సిల్ చేసుకుంటారు. అయితే మీ టిక్కెట్‌ను రద్దు చేసిన సమయం ఆధారంగా ఛార్జీలను భారతీయ రైల్వే తీసివేస్తుంది. అంతేకాకుండా, రైలు టికెట్ రద్దుకు వర్తించే వివిధ ఛార్జీల గురించి కూడా గందరగోళం ఉంది. అందువల్ల, రైలు రద్దు ఛార్జీల గురించి ఈ కథనంలో వివరాలను తెలుసుకోండి..మీరు భారతీయ రైల్వేలో ‘confirmed’, ‘RAC’, ' లేదా 'వెయిట్‌లిస్ట్'లో ఉన్న రైలు టిక్కెట్‌ను రద్దు చేస్తే, క్యాన్సిల్ చార్జీ విధిస్తుంది. మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, తగ్గించే మనీ.. మీరు కాన్సిల్...