Suresh Gopi కేరళ కమ్యూనిస్టు కంచుకోటలో చరిత్ర సృష్టించిన సురేష్ గోపి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయం..
BJP MP Suresh Gopi | మలయాళ నటుడు సురేష్ గోపి (Suresh Gopi) కేరళ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha election) ఘన విజయం సాధించి మొట్టమొదటి సారిగా కేరళ రాష్ట్రం నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా పార్టమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారు. 2016లో మొదటిసారి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన సురేష్ గోపి.. ఆ తర్వాత బీజేపీలో చేరి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ వెంటనే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను పోటీ చేయగా విజయం వరించలేదు. ముచ్చటగా మూడోసారి త్రిషూర్ నుంచి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నో ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొని చివరకు ఘన విజయం సాధించారుమళయాల సురేష్ గోపి. మలయాళ చిత్రసీమతో పాటు రాజకీయాల్లో ఆయనది సుదీర్ఘమైన కష్టతరమైన కథ. తన 39 ఏళ్ల సుదీర్ఘ సినీ జీవితంలో 65 ఏళ్ల...