Weather Report | రిలాక్స్ కండి.. నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు
Weather Report Updates | తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్న ప్రజలకు భారత వాతావరణ హైదరాబాద్ విభాగం చల్లని వార్త చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 7, 8, 9వ తేదీల్లో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఇక సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని తెలిపింది. ఈమేరకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్‌లో మాత్రం వానలు కురిసే చాన్స్ లేదని స్ప...