Rooftop Solar Scheme: ఉచిత సోలార్ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..
Rooftop Solar Scheme: ప్రజలు తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు.
ఈ పథకానికి 75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన ( PM Surya Ghar, Muft Bijli Yojana) , కింద ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా 1 కోటి గృహాల్లో వెలుగులు నింపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-'25 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని తొలిసారిగా ప్రకటించారు.Free Rooftop Solar Scheme సోలార్ ప్యానెల్ పథకం కింద, పథకం లబ్ధిదారులకు భారీగా సబ్సిడీలు అందించబడతాయని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని మోడీ చెప్పారు. భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల అందించి , ప్రజలపై ఎటువంటి వ్యయ భారం లేకుండా ...