Ration Card Application | కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సై.. వచ్చేనెల 2 నుంచి దరఖాస్తులు
Ration Card Application | ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. రేషన్ కార్డులు మంజూరుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూతన రేషన్ కార్డుల కోసం అక్టోబరు 2వ తేదీ నుంచి దరఖాస్తుల (Ration Card Application ) ను స్వీకరించాలని సీఎం సూచించారు.అర్హులందరికీ డిజి...