ఉద్యోగం నుంచి తొలగించారనే అక్కసుతో..
మొత్తం మొబైల్ షాపునే లూటీ చేశాడు..
వరంగల్: తనను ఉద్యోగంలో నుంచి తొలగించాడనే అక్కసుతో తాను పనిచేసిన మొబైల్ షాపులో సెల్ ఫోన్లను చోరీ చేసిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన సెల్ ఫోన్లను విక్రయించేందుకు సహకరించిన మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22 లక్షల విలువైన 78 స్మార్ట్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు రెండు ట్యాబ్స్, రెండు స్మార్ట్ వాచ్ లు, కారు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ ఏవీ.రంగనాథ్ వెల్లడించారు. వరంగల్ పాపయ్యపేట చమన్ కు చెందిన ప్రధాన నిందితుడు రబ్బాని(30) బీకాం పూర్తిచేసి, కొద్ది రోజులు బిగ్ సి మొబైల్ షాపులో సెల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు. అనంతరం 2018 నుంచి 2021 మధ్యకాలంలో నిందితుడు రబ్బాని హనుమకొండ చౌరస్తాలోని లాట్ మొబైల్స్ లో స్టోర్ మేనేజర్ గా పనిచేశాడు. కొన్నాళ్లకు రబ్బానీ వ్...