Inavolu Mallanna | ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. జానపదుల జాతర విశేషాలు తెలుసా.. ?
Inavolu Mallanna Swamy Temple: కాకతీయుల కళా వైభవం ఉట్టిపడే మహిమాన్విత క్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం.. భక్తులు కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కొంగుబంగారం, గొల్ల కురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్య దైవ్యంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. జాన పదుల జాతరగా పిలిచే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుండగా.. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సమీప జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. మరికొద్ది రోజుల్లోనే ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఐలోని మల్లన్న ఆలయ విశిష్టత గురించి మీరూ తెలుసుకోండి..ఆలయ చరిత్ర
ఐనవోలు పుణ్యక్షేత్రాన్ని కాకతీయులు నిర్మించారనే పలువురు చెబుతుండగా చాళుక్యుల కాలంలోనే నిర్మించారని చారిత్రక ఆధారాలు సూ...