Thursday, December 26Thank you for visiting

Tag: Telangana Mahalaxmi scheme

‘సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?

‘సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?

National
ఉచిత బస్సు ప్రయాణంపై ఓ ప్రయాణికుడి ఆవేదన ఇదీ.. TS RTC Mahalaxmi Scheme | హైదరాబాద్: తెలంగాణలో 'మహాలక్ష్మి' పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ఉచిత సర్వీస్ అమలు అవుతోంది. ఈ క్రమంలో అన్ని బస్సుల్లో రద్దీ పెరిగింది. ఉద్యోగినులు, గృహిణులు, విద్యార్థినులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ సౌకర్యం తమకు ఆర్థికంగా తమకెంతో ప్రయోజనం కలుగుతోందని చెబుతున్నారు. అయితే, ఇదే పథకం వల్ల తాము పడరాని పట్లు పడుతున్నామని, తమకు సీట్లు లేకుండా పోతున్నాయని పురుషులు గగ్గోలు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ఎక్స్(ట్విట్టర్) వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.. 'సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు పెట్టి మేము నిలబడాలా..?' అని ప్రశ్నించాడు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారని, ...