TG Raithu Runa Mafi | రైతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ నగదు ఖాతాల్లో జమ..
Second Fhase Loan Waiver : రాష్ట్ర రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. శాసన సభ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణ మాఫీ ( TG Raithu Runa Mafi )నిధులను విడుదల చేశారు. ఇప్పటికే లక్ష రూపాయల రుణబకాయిలు ఉన్నవారికి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేశారు. తెలంగాణలో మొత్తం 6,40,223 మందికి రూ.6190.01 కోట్ల మేర రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఇక మూడో విడత కింద 17, 75, 235 మంది రైతులకు రూ.12,224.98 కోట్లు విడుదల చేశారు. కాగా రాష్ట్రంలోని 17పార్లమెంటు నియోజక వర్గాల నుంచి లబ్దిదారులను రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారు.తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే రూ.లక్ష రుణాన్ని మాఫీ చేసింది. తెలంగాణలో 11,34,412 మందికి రూ...