IMD Hyderabad | నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం.. రెండు రోజులకు ఈ జిల్లాల్లో వర్షాలు..
హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో మరోసారి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది. ఈనెల 20 వరకు తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ (IMD Hyderabad ) అంచనా వేసింది.ఆదివారం నుంచి వర్షాలుతెలంగాణలో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఏప్రిల్ 21న కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, కామారెడ్డి, మెదక్, వై.భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఈ వర్షపాతం తెలంగాణ వాసులకు ఊరటనివ్వనుంది. IMD హైదరాబాద్ ప్రకారం, ఉష్ణోగ్రతలు 36-40 డ...