KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!
KCR resigns to Telangana CM Post: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ ఓఎస్డీ తో తన రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపించారు.ఎగ్జిట్ పోల్స్‌లో ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బీఆర్‌ఎస్ కు గట్టి షాక్ తగిలింది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు బీఆర్‌ఎస్ పరాజయాన్నిఅంగీకరించారు. రెండు సార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాలను ఒక పాఠంగా భావిస్తామని, మరలా పుంజుకొంటామని కేటీఆర్, హరీశ్ రావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్య...