వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్
వరంగల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (warangal cyber police station) ను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరాలు (cyber crime) కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు సంబంధంచిన ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు వరంగల్ సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవసరమైన ప్రదేశాన్ని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ...