Wednesday, July 30Thank you for visiting

Tag: Telangana Chief Minister K. Chandrashekar Rao

ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

Telangana
 హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి బ్రేక్ పడింది. విలీనానికి అన్ని చట్టపరమైన సమస్యలను పరిశీలించిన తర్వాతే బిల్లుపై సంతకం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేయడంతో దానికి ఆమోదముద్ర పడలేదు. దీనికి మరికొంత సమయం అవసరమని గవర్నర్ పేర్కొన్నారు. పర్యవసానంగా, ఆదివారంతో ముగియనున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ యోచనలు బెడిసికొట్టాయి.కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నందున, ఎన్నికలకు ముందు చివరి సెషన్‌లో టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు లేనట్టే.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం సభలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించినా.. దానికి గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. తర్వాత తేదీలోగానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి ...
వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు

వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు

Telangana
రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న 4 శాతం, పత్తి 7 శాతం తగ్గినట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.సుదీర్ఘ వేసవి కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సాగుబడికోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని అందించలేకపోయింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు నమోదవుతున్నందున, మిషన్ భగీరథ ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంపైనే దృష్టి సా...