Telangana BJP | రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు..?
Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర (Telangana BJP ) అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వారసుడు ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్ఠానం ఒక స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramchander Rao) పేరును ఫైనల్ చేసింది. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ వేయాలని పార్టీ హైకమాండ్ ఆయనను ఆదేశించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ సమర్పించనున్నారు.రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే పార్టీ అధిష్టానం మాత్రం రమచందర్‌రావు వైపే మొగ్గుచూపింది.రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు స...