TG Ration Cards | తెల్లరేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం
TG Ration Cards | రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఉగాది నుంచి రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు. మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రేషన్ షా...