Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన హైదరాబాద్ - విజయవాడ రహదారి (Hyderabad-Vijayawada National Highway) విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు భూ సేకరణ పూర్తయింది. ఈ క్రమలో వెంటనే పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్ హెచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరిని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ రెండు నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని బదులిచ్చారు.భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( National Highway Authority of India (NHAI)) పరిధిలో రహదారుల నిర్మాణానికి తలెత్తున్న సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్షించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ...