Modernization of ITI’s | విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీకరణకు రూ.2,324.21 కోట్లు..
Modernization of ITI's | హైదరాబాద్: యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణను నైపుణ్యం కలిగిన యువశక్తికి కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు దిగ్గజ ఐటీ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో ప్రభుత్వం ఇప్పటికే 10 ఏళ్ల అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.మంగళవారం మధ్యాహ్నం మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు ఏటీసీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన పరికరాలు, సాంకేతికతను అందుబాటులోకి తీసుక...