New Tata Nano | టాటా నానో మళ్లీ వస్తుందా? టాటా మోటార్స్ కొత్త నానో కారులో ఏయే ఫీచర్లు ఉంటాయో తెలుసా..?
New Tata Nano | రతన్ టాటాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ టాటా నానోను పునరుద్ధరించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ నానో కారును భారత మార్కెట్లోకి మళ్లీ పరిచయం చేయనుంది. ఈ సామాన్యుడి కారు ఆధునిక అప్‌డేట్‌లు, కొత్త డిజైన్, మెరుగైన పనితీరుతో తిరిగి వస్తుంది.నివేదికలను బట్టి టాటా నానో కాంపాక్ట్ డిజైన్ పునర్నిర్మించి.. ఆధునిక హంగులతో వస్తుందని తెలుస్తోంది. సిటీ డ్రైవింగ్ కోసం చిన్న కొలతలను కొనసాగిస్తూనే నానో ఇప్పుడు అధునాతన హెడ్‌లైట్ డిజైన్, రిఫ్రెష్ బాడీ ఆకృతులతో వస్తుంది. కారు తాజా డిజైన్ కొత్త, పాత తరం వారిని ఆకర్షించేలా ఉండనుంది.
అధిక మైలేజీ ఇచ్చేలా ఇంజిన్
కొత్త టాటా నానోలో అప్‌గ్రేడ్ చేసిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్నిపెంచుతూ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ కారు 30 kmpl వరకు మైలేజీని ఇస్తుంద...