Cancer Treatment | క్యాన్సర్ రోగులకు శుభవార్త.. క్యాన్సర్ రాకుండా మాత్రలు కనుగొన్న టాటా ఇన్‌స్టిట్యూట్
Cancer Treatment | ముంబై: ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ కు భారతదేశంలో ప్రసిద్ధమైన క్యాన్సర్ పరిశోధన, చికిత్సా సంస్థగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ ఇన్‌స్టిట్యూట్ అసమానమైన ఘనతను సాధించింది. రెండవసారి క్యాన్సర్ రాకుండా నిరోధించే చికిత్సను కనుగొన్నట్లు పేర్కొంది.
ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు, వైద్యులు పదేళ్లపాటు శ్రమించి ఇప్పుడు ఒక టాబ్లెట్‌ను అభివృద్ధి చేశారు, ఇది రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా నిరోధించగలదని, రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50 శాతం తగ్గించగలదని వారు పేర్కొన్నారు.పరిశోధన బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాన్సర్ పై పరిశోధన కోసం ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. ఇది వాటిలో కణితిని ఏర్పరుస్తుంది. అ...