Tata EV | టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్ Nexon, Punch EVలపై రూ. 3 లక్షల వరకు తగ్గింపు
Tata EV | టాటా మోటార్స్ తన ఫెస్టివల్ ఆఫ్ కార్స్ (Festival of Cars) కార్యక్రమంలో భాగంగా, టాటా ఈవీలలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లతో సమానంగా ఉందని టాటా పేర్కొంది. ఆఫర్ లో భాగంగా రూ.3 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా Punch.ev ఇప్పుడు రూ.9.99 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇది మార్కెట్లో అత్యంత సరసమైన Electric SUVలలో ఒకటిగా నిలిచింది.Tiago.ev కూడా ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అయితే దీని ధర ₹7.99 లక్షల వద్ద ఎటువంటి మార్పు లేదు. సాంప్రదాయ అంతర్గత దహన ఇంజిన్ (ICE) వాహనాలతో సమానంగా తమ EVలను అందిస్తున్నట్లు టాటా పేర్కొంది. ఇది EV అడాప్షన్‌కు ఉన్న కీలకమైన అడ్డంకులను అధిగమించగల...