BSNL వైపు వినియోగదారుల చూపు.. భారీగా పెరిగిన సబ్ స్క్రైబర్లు
BSNL | రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా వొడఫోన్ వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారీఫ్ ప్లాన్లను ఒక్కసారిగా పెంచేయడంతో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు (BSNL) వినియోగదారులు పోటెత్తుతున్నారు. మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలూ ఓ వైపు యూజర్లను కోల్పోతుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంటూ పోతోంది. గత ఆగస్టు నెలకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం స్పష్టమైంది.జూలైలో ప్రధాన టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ధరల పెంచింది. దీంతో ఆ నెలలో మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 9.2 లక్షలు తగ్గింది. ఆగస్టు నెల వొచ్చేసరికి ఈ సంఖ్య 57.7 లక్షలుగా ఉంది. ఈ క్రమంలోనే జూలైలో కొత్తగా 29.3 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరారు. ఆగస్టులో మరో 25.3 లక్షల మంది బిఎస్ ఎన్ ఎల్ కు మారారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్‌లను పెంచేది లేదన...