
Save Aravalli Hills | ఆరావళి మనుగడకే ముప్పు?
Save Aravalli Hills | న్యూఢిల్లీ: భారతదేశ పర్యావరణ వెన్నెముకగా పిలువబడే ఆరావళి పర్వత శ్రేణులు ఇప్పుడు అస్తిత్వ పోరాటాన్ని ఎదుర్కొంటున్నాయి. సుమారు 2 బిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన పర్వతాలను కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ఆరావళి కొండల నిర్వచనాన్ని మార్చడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.కొత్త నిర్వచనం - పెరుగుతున్న ఆందోళనసుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం, 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలను మాత్రమే రక్షిత ప్రాంతాలుగా పరిగణిస్తారు. దీనివల్ల దాదాపు 91 శాతం ఆరావళి ప్రాంతం రక్షణ పరిధి నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది మైనింగ్ మాఫియాకు మరియు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు వరంగా మారుతుందని, పర్యావరణానికి శాపంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉత్తర భారత రక్షణ కవచంఢిల్లీ నుండి గుజరాత్ వరకు దాదాపు ...
