Summer Hacks | మీరు AC లేకుండా హీట్‌వేవ్‌ను తట్టుకోవచ్చా..? ఈ చిట్కాలు పాటించండి..
Summer Hacks | వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు బయట అడుగు పెడితే ఒక నిప్పుల కొలిమిలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పలు ప్రాంతాల్లో హీట్‌వేవ్ హెచ్చరికను జారీ చేసింది. ఇదే సమయంలో వేసవిలో కరెంట్ కోతలు మరింత ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. ఎయిర్ కండిషనర్స్ (ఏసీలు), కూలర్లు లేకుండా బతకలేని పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఎయిర్ కండిషనింగ్ లేకుండా కూడా వేసవి తాపం నుంచి తప్పించుకోవచ్చు. మీ యుక్తితో, మీరు ఈ హీట్‌వేవ్ నుంచి విజయం సాధించవచ్చు. మిమ్మల్ని చల్లగా, సౌకర్యవంతంగా ఉంచడానికి ఉపాయాలను అందిస్తున్నాం ఓ లుక్కేయండి..ఆల్కహాల్, కెఫిన్ వినియోగాన్ని తగ్గించండి : ఆల్కహాల్ మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది. వేసవిలో అది మీకు మరింత వేడికి గురిచేస్తుంది. మీరు చక్కెర పానీయాలు, మితిమీరిన కెఫిన్‌లకు దూరంగా ఉండాలి. ఇది మిమ్మల...