Sudarshan Setu | అందుబాటులోకి వచ్చిన దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్
Sudarshan Setu | దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ (Indias Longest Cable Stayed Bridge) ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ప్రారంభించారు. గుజరాత్ లోని ద్వారకాలో ఈ వంతెనను నిర్మించారు. ‘సుదర్శన్ సేతు’ (Sudarshan Setu) అనే పేరు గల ఈ వంతెన పొడవు 2.3 కిలోమీటర్లు. ఇది ఓఖా (Okha) ప్రాంతాన్ని బెట్ ద్వారకా (Beyt Dwarka)తో కలుపుతుంది.2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పు, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లైన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ కి ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పు గల ఫుట్‌పాత్‌లు సైతం ఉన్నాయి. సుదర్శన్ సేతు ను ఒక విలక్షణమైన డిజైన్‌తో నిర్మించారు. బ్రిడ్జికి ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలను ఆకట్టుకుంటాయి.
Longest Cable Stayed Bri...