టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమకు పాఠాలు చెప్పిన టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. తాము గ్యాంగ్ స్టర్లమని పేర్కొంటూ ఆ యువకులు ఆ టీచర్ పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్ లో సుమిత్ సింగ్ అనే వ్యక్తి ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్ సెంటర్ లో చదివిన ఈ ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్ ను మాట్లాడుతామని బయటకు పిలిచారు. తమ వెంట తెచ్చిన గన్ తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్ గాయమైన టీచర్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అదిరిపోయే ఫీచర్లు.. సరికొత్త డిజైన్ తో Google Pixel 8 సిరీస్ వచ్చేసింది
మరోవైపు టీచర్ కాలుపై కాల్పులు (Students Shoot Teacher జరిపి ప...