Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి : గతంలో ఇలాంటి విషాద ఘటనలు ఎన్నో..
Hathras stampede : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 116 మందికి చేరుకుంది. ఈమేరకు అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథూర్ పీటీఐకి వెల్లడించారు. మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ మెడిల్ టీం హత్రాస్ కు చేరుకుంటుందని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
కారణాలు ఇవే..
భారతదేశంలో ఆధ్యాత్మిక సమావేశాలు, ఉత్సవాలు తరచూ జరుగుతుంటాయి. ఇందుకోసం వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. అయితే ఆయా సమావేశాల వద్ద ఎటువంటి కనీస సౌకర్యాలు ఉండవు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిపోయేందుకు సరైన మార్గాలు ఉండవు. కొన్నిసార్లు, ఈ ఈవెంట్‌ల నిర్వాహకులకు స్థానిక అధికారులతో సరైన కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఫలితంగా ఒక్కోసారి ద...