TG SSC Exams Fee 2025 : పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల – ముఖ్యమూన తేదీలు..
SSC Exams | తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు కీలక ప్రకటన వొచ్చేసింది. పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించుకునేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎలాంటి రుసుం లేకుండా నవంబర్ 18 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు చెల్లించుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఈ సంవత్సరం పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు బ్యాక్ లాగ్‌లు ఉన్న విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు చెల్లించుకోవచ్చు. గడువు దాటితే… రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. డిసెంబర్ 12 వరకు రూ. 200 ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21 వరకు చెల్లించుకునే చాన్స్ ఉంటుంది.రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు పేపర్లలోపు బ్యాక్ లాగ్ ఉంటే రూ.110 చెల్లించాల...